TOP STORIESBreaking Newsజాతీయం

Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!

Srisailam : శ్రీశైలం కు మళ్లీ భారీ వరద.. 10 గేట్ల ఎత్తివేత..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కృష్ణానది పరివాహక ప్రాంతంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కృష్ణానది మరోసారి వరద ఉధృతి పెరిగింది. కాగా జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

దాంతో శ్రీశైలం కు భారీగా వరద ఉధృతి పెరిగింది. పరిస్థితిని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలం డ్యాం 10 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఈ ఏడాది ఇది రెండవసారి. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,13,623 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 1,22,876 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880 అడుగుల నీటిమట్టం ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.

LATEST UPDATE :

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు పూచీకత్తు ఎవరిచ్చారో తెలుసా..!

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు