Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుయాదాద్రి భువనగిరి జిల్లా

Accident : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరుసగా ఢీకొన్న భారీ వాహనాలు..!

Accident : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వరుసగా ఢీకొన్న భారీ వాహనాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలం కైతాపూర్ శివారులోని బొర్రలగూడెం స్టేజి సమీపంలో రెండు ట్రావెల్ బస్సులు ఒక కంటైనర్ లారీ మరో ట్రావెల్ బస్సు వసగా ఢీకొన్నాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వెళుతుంది. ఈ బస్సుకు ముందు ఒక లారీ అడ్డు రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దాంతో వెనకాలే వస్తున్న రమణ ట్రావెల్స్ బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. రమణ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టింది.

కంటైనర్ లారీ వెనుక నుంచి మోజో ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సుల అద్దాలు పగిలి పాక్షికంగా దెబ్బతిన్నాయి. కానీ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరింపజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు