Devarakonda : అయ్యా.. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి.. మిస్సింగ్ అయిన గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల మొర..!
Devarakonda : అయ్యా.. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి.. మిస్సింగ్ అయిన గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల మొర..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ కొండభీమనపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైనారిటీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయిన సంఘటనపై జిల్లా అధికారులు పాఠశాలలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా అధికారుల ఎదుట తమ పిల్లలు ఏమయ్యారో చెప్పాలంటూ మొరపెట్టుకున్నారు.
ప్రిన్సిపాల్ ఎవరు…? పేరుకే నేనే ప్రిన్సిపాల్ అంటూ…సమస్యలు రాగానే నేను కాదు ప్రిన్సిపాల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అంటూ…. సమస్యలు వస్తే కప్పి పుచ్చుకొనె పరిస్థితి ఇక్కడ నెలకుంది.
మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు 1) తౌఫిక్ 2) అబ్దుల్ రహమాన్ 3) ముజిబ్ విద్యార్థులు పాఠశాల నుండి మిస్సింగ్ అయినారు.
పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయప్రాంతలకు గురి చేయండం వలెనే విద్యార్థులు వెళ్లి పోవడం జరిగింది అని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూ….ఉపాధ్యాయల నిర్లక్ష్యం తోనే జరిగింది అని ఆరోపిస్తున్నారు.
ఇంతకీ మేము ఎవరికీ అడగాలి ఎక్కడ వెళ్ళాలి అని అన్నారు. మంగళవారం మిస్సింగ్ ఐనా విద్యార్థుల కోసం ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఉపాధ్యాయలు పట్టించుకోకుండా ఉన్నారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
అసలు మా పిల్లలు (మీ విద్యార్థులు) ఉన్నారా…? ఏమైనా జరిగిందా అని విద్యార్థుల తల్లితండ్రులు అనుమానంతో ఉన్నారు. దేవరకొండ మైనారిటీ పాఠశాల మిస్సింగ్ విషయం తెలుసుఉన్న జిల్లా అధికారి ఆర్ సి ఓ విష్ణు మూర్తి గౌడ్ దేవరకొండ సందర్శించి ఎం జరిగిందో విచారణ చేశారు.
జిల్లా అధికారి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మేము కూడా విద్యార్థుల కోసం మా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
పాఠశాల సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మైనార్టీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తప్పిపోవడం పట్ల బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా
విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపాల్, నర్స్ మేడం నిర్లక్ష్యంతోనే జరిగింది అని అన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల తో కలసి మధ్యాహ్నం భోజనం పరిశీలించినారు. మైనారిటీ పాఠశాలలో ప్రిన్సిపాల్..? ఎవరు నేనే ప్రిన్సిపాల్… నేను ఇన్చార్జి ప్రిన్సిపాల్ అంటూ ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు.
తక్షణమే మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షణ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలుపునిస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ, యుఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, విద్యార్థుల సంఘాల నాయకులు ఆకారపు నరేష్, వంగూరి వెంకటేశ్వర్లు, బూడిగ వెంకటేష్, మొహమ్మద్ సౌబాన్, రామావత్ లక్ష్మణ్, మహమ్మద్ సిరాజ్, నాగార్జున శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Miryalaguda : మిర్యాలగూడలో నేడు మంత్రుల పర్యటన..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!












