Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : సాగర్ సందర్శించిన హైకోర్టు న్యాయ మూర్తి..!

Nagarjunasagar : సాగర్ సందర్శించిన హైకోర్టు న్యాయ మూర్తి..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కె సృజన కుటుంబ సమేతంగా సందర్శించారు. నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు నిడమనూరు కోర్టు న్యాయమూర్తి అపూర్వ రవళి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వీరు నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. ఆపైన బుద్ధవనం చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం మహాస్థూపాన్ని, బుద్ధ చరిత వనం సందర్శించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బుద్ధవనం తెలంగాణలోని బౌద్ధ సందర్శన ప్రదేశాలలో ప్రథమంగా నిలుస్తుంది అన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరితోపాటు నిడమనూరు కోర్టు సూపర్ ఇంటినెంట్ చంద్రశేఖర శర్మ, స్థానిక ఎస్సై సంపత్ గౌడ్, ఆర్ ఐ దండ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Nalgonda : నిఘా నీడలో శోభాయాత్ర.. నిరంతర పర్యవేక్షణ, నల్గొండలో ట్రాఫిక్ ఆంక్షల..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు