Nalgonda : బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కు నిరసన.. బీసీ సంఘాల రాస్తారోకో..!

Nalgonda : బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కు నిరసన.. బీసీ సంఘాల రాస్తారోకో..!
నల్లగొండ, మన సాక్షి.
42 శాతం రిజర్వేషన్ల హైకోర్టు నాలుగు వారాలు స్టే విధించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉమ్మడి బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ వద్ద రాస్తారోకో శుక్రవారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మరో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ పాల్గొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు బీసీల తో కలిసి నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మరో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేలపట్ల సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి రిటైర్డ్ ఐఏఎస్ సొల్లేటి ప్రభాకర్ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు వైద్యుల సత్యనారాయణ లు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి 340 ఆర్టికల్ ప్రకారం బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వొచ్చని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా జనగణలో కులగన బీసీల లేకపోవడం తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డిక్టేటెడ్ కమిషన్ ద్వారా సర్వే చేయాలని ఆర్ కృష్ణయా హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల డిక్టేటర్ కమిషన్ జనగణాల్లో కుల గణన చేపట్టడం జరిగిందని చెప్పారు. అసెంబ్లీలో అఖిలపక్షంతో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. పెద్ద ఎత్తున కొన్ని సంఘాలతోని రేవంత్ రెడ్డి తో సహా పాల్గొని కేంద్రాన్ని రాష్ట్రానికి రప్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి 50 సార్లు పైగా పోయిన ఏ ఒక్క సారి కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లలేదు.
ప్రతిపక్షాలని బీసీ సంఘాలతోని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని పోవాలని ఎన్నోసార్లు బీసీ సంఘాలు మేధావులు ఆర్.కృష్ణయా చెప్పిన తీసుకపోకుండా దాటవేసే ధోరణి చేశాడు. కోర్టు 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదని ఒక నిబంధనను ఉన్నది కేంద్రం అడ్డుకుంటుందని నెపంతో కేంద్రం రాష్ట్రం మీద రాష్ట్రం కేంద్రం మీద కాలం గడుపుతున్నాయి అన్నారు.
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 42 శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇవ్వాలని ఉమ్మడి కార్యాచరణలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నల్ల సోమ మల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఇంద్రయ్య, పుట్ట వెంకన్న గౌడ్, కారింగుల యాదగిరి,
సింగం లక్ష్మీనారాయణ, శంకర్ ముదిరాజ్, మునాస ప్రసన్నకుమార్. అయితే గొన్ జనార్దన్ గౌడ్. ఆడెం తిరుపతయ్య గౌడ్, మధు యాదవ. సాయిబాబా, భరత్, జిల్లా నారాయణ, గంజి బిక్షమయ్య, వల్ల కీర్తి శ్రీనివాస్, విద్యార్థి యువజన మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
MOST READ :
-
Applications : అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..!
-
Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..!
-
Chinese Wok : తెలుగు రాష్ట్రాల్లో చైనీస్ వోక్ విస్తరణ.. సరికొత్త ప్రచారం షురూ..!
-
Platelets : ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. అయితే ఇలా తిరిగి పొందండి ఈజీ..!
-
Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!









