Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లావిద్య

Holidays : విద్యా సంస్థలకు సెలవు..!

Holidays : విద్యా సంస్థలకు సెలవు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు జరిగే ఆయా మండలాల్లో పోలింగ్ రోజున, పోలింగ్ ముందు రోజున విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు జరిగే నారాయణపేట, దామర గిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో పోలింగ్ జరిగే ఈనెల 14న ఆదివారం, ముందు రోజు 13న రెండవ శనివారం సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.

మూడవ విడతలో ఎన్నికలు జరిగే మక్తల్, మాగనురు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల్లో పోలింగ్ రోజు ఈ నెల 17వ తేదీన, ముందు రోజు 16వ తేదీన అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. సెలవులను వినియోగించుకొని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

MOST VIEWS 

  1. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం.. 74 మందికి షోకాజ్ నోటీసులు..!

  2. District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

  3. CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!

  4. Local Body Elections : పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికలు.. జోరుగా పందేలు..! 

మరిన్ని వార్తలు