Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివైద్యంహైదరాబాద్

Hyderabad : పరువు హత్య.. కానిస్టేబుల్ అక్కను చంపిన తమ్ముడు.. మరో ట్విస్ట్..!

Hyderabad : పరువు హత్య.. కానిస్టేబుల్ అక్కను చంపిన తమ్ముడు.. మరో ట్విస్ట్..!

మన సాక్షి , హైదరాబాద్ :

హైదరాబాద్ నగరంలో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందనే కారణాలతోనే మహిళా కానిస్టేబుల్ ను సొంత తమ్ముడు హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. హైదరాబాదులోని ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. నాగమణి ని ఆమె తమ్ముడు పరమేష్ కారుతో ఢీకొని కొడవలితో నరికి చంపాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడం వల్లనే పరమేష్ తన అక్క పై కక్షపెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

రాయపోలు నుంచి మన్నెగూడ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ నాగమణి ని మాటువేసి కారుతో ఢీకొని హత్య కు పాల్పడ్డాడు. ఆమె హయత్ నగర్ లోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. నెలరోజుల క్రితమే ప్రియుడితో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

కాగా నాగమణి భర్త శ్రీకాంత్ దళిత సంఘాలతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగాడు. తాము ఒకే గ్రామానికి చెందిన వారమని, చిన్ననాటి నుంచి క్లాస్మేట్స్ అని చెప్పాడు. యాదగిరిగుట్టలో గత నెల వివాహం చేసుకున్నట్లుగా పేర్కొన్నాడు. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే నాగమణిని హత్య చేసినట్లుగా పేర్కొంటున్నాడు.

నాగమణికి గతంలోనే వివాహం అయ్యింది. కాగా ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో తమ్ముడు పరమేష్ అన్ని చూసుకునేవాడు. మొదటి భర్తతో విడాకులు అయ్యాక ఆస్తుల విషయాలన్నీ కూడా పరమేష్  చూసుకునేవాడు.

నాగమణి రెండవ వివాహం చేసుకున్నాక ఆస్తి ఆమెకు పోతుందని, ఈ విషయంపై కొంతకాలంగా వివాదం కూడా కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఆస్తికోసం అక్కను హత్య చేశాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు