చౌటుప్పల్ : అధ్వాన్నంగా హోటళ్లు.. శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..!

చౌటుప్పల్ : అధ్వాన్నంగా హోటళ్లు.. శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..!

చౌటుప్పల్. మన సాక్షి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, లింగోజిగూడెం ప్రాంతాల లోని విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న పలు హోటల్సను ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. హోటల్స్ లోని పలు పదార్థాలు అపరిశుభ్రంగ ఉన్నాయని గమనించి శుభ్రంగా ఉంచాలని వారిని హెచ్చరించారు.

 

ఆ హోటల్స్ నుంచి పలు శాంపిల్స్ ను సేకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించమని తెలిపారు. సేకరించిన శాంపుల్స్ కల్తీ అని తేలినట్లయితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకొ బడతాయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తెలియజేశారు.

ప్రజలకు అందించే ఆహారం శుభ్రమైనది, ఆరోగ్య కరమైనది గా ఉండాలని లేనిచో కఠినమైన చర్యలు తప్పవని ఇలాంటి దాడులు నిత్యం జరుగుతాయని హోటల్ నిర్వాహకులను హేచ్చరించారు.