Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESviralటెక్నాలజీతెలంగాణరాజకీయం

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

Digital Voter Card : ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఇలా చేయండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఎన్నికల సమయంలో ఓటర్ కార్డు కోసం చాలామంది వెతుకుతున్నారు. అయితే ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డు చాలా సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఓటర్ ఐడి కార్డు లేకున్నా.. డిజిటల్ ఓటర్ ఐడి కార్డు సహాయంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. అయితే మనం ఆన్ లైన్ లో డిజిటల్ ఓటర్ ఐడి కార్డును చాలా సింపుల్ గా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం…

 

ALSO READ : WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

 

డిజిటల్ ఓటర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా డిజిటల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్ ఓటర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ తో పాటు యాప్ను అందించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ది ఇది అందించిన ఈ సైట్ మరియు అప్ ద్వారా చాలా సింపుల్ గా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చును.

ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in/ ఓపెన్ చేయాలి. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోం పేజీ కనిపిస్తుంది. హోం పేజీలో కుడివైపు భాగం చివరిలో ఈ ఎపిక్ డౌన్ లోడ్ అనే ప్రత్యేకమైన బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేసి డౌన్ లోడ్ పేజీకి చేరుకోవచ్చు. అయితే లాగిన్ అవ్వని వారు మాత్రం లాగిన్ పేజీకి వెళ్తారు.

 

ఈ వెబ్ సైట్ లో ముందుగా లాగిన్ కాకపోతే మీ మొబైల్ నెంబర్ తో కొత్త ఎకౌంటు ద్వారా సైన్ అప్ కావచ్చును. దీనికోసం మీరు మీ మొబైల్ నెంబర్ ను కలిగి ఉంటే సరిపోతుంది. ఇక లాగిన్ చేసిన తర్వాత E-Epic Download పైన నొక్కడం ద్వారా కొత్త పేజీకి చేరుకుంటారు.

 

ALSO READ : Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

 

కొత్త పేజీ కి చేరుకున్న తర్వాత ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. అందులో కావాల్సిన ఓటర్ ఐడి ఈపిఐసి (EPIC) నెంబర్ ఎంటర్ చేయాలి. క్రింద బాక్సులో రాష్ట్రాన్ని కూడా సెలెక్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత పక్కనే ఉన్న సెర్చ్ నొక్కండి. ఇక్కడ అడిగిన ఓటర్ ఐడి యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి.

 

వివరాల క్రింద అడిగిన వద్ద ఓటిపి కోసం రిక్వెస్ట్ చేయాలి. ఇలా రిక్వెస్ట్ చేసిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. మొబైల్ నెంబర్ పైన అందుకున్న ఓటీపీని ఎంటర్ చేసి డౌన్ లోడ్ నొక్కాలి. కోరుకున్న డిజిటల్ ఓటర్ ఐడి డౌన్ లోడ్ అవుతుంది. అంతే చాలా సింపుల్ గా డిజిటల్ ఓటర్ ఐడి ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ALSO READ : KTR : నువ్వు కట్టుకుంటావా చీర.. లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా..? 

మరిన్ని వార్తలు