క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ దందా.. కేతేపల్లిలో వెలుగులోకి..!

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ దందా.. కేతేపల్లిలో వెలుగులోకి..!

కేతేపల్లి, మనసాక్షి

నల్గొండ జిల్లాలో భారీ దందా వెలుగులోకి వచ్చింది. అక్రమంగా ముడి పామాయిల్ దందా కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కేతేపల్లి మండలం జాతీయ రహదారి 65 పైన చీకటి గూడెం గ్రామ శివారు హెచ్.పి పెట్రోల్ బంక్ ఎదురుగా గత కొంతకాలంగా ట్యాంకర్ల డ్రైవర్ల వద్ద నుండి తక్కువ ధరకు ముడి ఫాం ఆయిల్ ని కొనుగోలు చేసి అట్టి ఆయిల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతంలో లో ఎక్కువ ధరకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు.

చీకటి గూడెం గ్రామానికి చెందిన కిరణ్, కోట భాస్కర్, వీరిద్దరి మీద కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 12 డ్రమ్ముల కల్తీ ఆయిల్, ఒక టాటా గూడ్స్ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కేతేపల్లి ఎస్సై యు సతీష్ తెలిపారు.

MOST READ :

  1. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. BREAKING : కొర్లపహాడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..!

  3. TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!

  4. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

మరిన్ని వార్తలు