Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

TG : అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం..!

అంగరంగ వైభవంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది.

TG : అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

అంగరంగ వైభవంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది. శుక్రవారం స్థానిక మిథిలా స్టేడియంలో జరిగిన తిరు కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి తో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, దన సరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, డిజిపి శివధర్ రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు, అశేష భక్తులు పాల్గొన్నారు.

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం రూ. 351 కోట్లతో తొలి దశలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అందులో భాగంగా రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు, రూ. 96 కోట్ల రూపాయలు ఆలయ పరిసర అభివృద్ధికి, మరో 75 కోట్ల రూపాయలతో గోదావరి ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు