Musi River : మూసి జలాశయంలోనికి భారీగా వరద.. 9 గేట్లు ఎత్తివేత..!

Musi River : మూసి జలాశయంలోనికి భారీగా వరద.. 9 గేట్లు ఎత్తివేత..!
కేతేపల్లి, మనసాక్షి :
కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టు జలాశయం లోనికి శనివారం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హైదరాబాదులోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టు లోనుంచి భారీగా నీరు విడుదల కావడంతో శనివారం ఉదయానికి వరదనీరు పోటెత్తింది.
మూసి ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్నందున దిగువ ప్రాంతానికి అదే స్థాయిలో నీటిని విడుదల చేయడం జరుగుతుందని దిగువ ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ ఈ వెంకటరమణ తెలిపారు.
జలాశయంలోనికి 23373.68 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు యొక్క 9 క్రస్ట్ గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 23004.00 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 166.63 ఎ డమ కాలువ ద్వారా 142.83 ఇతర లీకేజ్ ద్వారా 60.22 మొత్తం 23,373.68 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు డి ఈ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం స్థాయి 645 ఫీట్లు కాగా, ప్రాజెక్టులో జలాశయంలో 643 ఫీట్లు నీటి నిలువ స్థాయిని నిలకడగా ఉంచడం జరుగుతుందని ఆయన వివరించారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా 3.94 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.
MOST READ :









