Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ తెలియజేశారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం దండగ కాదు పండగ చేశామన్నారు.
ఒట్టేసి చెప్పినట్లుగా తాను రెండు లక్షల రుణమాఫీ చేశానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయలను ఏడాది కాలంలోనే మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ ఏ విధంగా అయితే చేసి రైతులను ఆదుకున్నామో అదే విధంగా సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఆదుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
రైతులంతా సన్నధాన్యమే పండించాలని, ఎంత ధాన్యం పండిస్తే అంత ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, బోనస్ కూడా అందించడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
అదేవిధంగా రైతులకు సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వారి వారి ఖాతాలలో నేరుగా జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు. రైతు భరోసా పై వాడో.. వీడో.. ఎవడో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వాళ్ళ మాటలు రైతులు ఎవరు వినవద్దన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా పడుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ గుండెలు అదిరిపోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ లాగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామనే మాటలు తాము చెప్పలేదు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటే పది ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం 7.50 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రతినెల 6,500 కోట్ల రూపాయల అప్పు, వడ్డీ చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏడాదిగా 65 వేల కోట్ల రూపాయల అప్పు వడ్డీ చెల్లించినట్లు పేర్కొన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోయినట్లు ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!
-
Cm Revanth Reddy : ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే నల్లగొండ నిర్లక్ష్యం..!
-
Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!









