Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!

Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన (PMKY) నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైతులకు 19 విడతలుగా పంట సహాయం కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఒక్కో విడతకు ₹2,000 చొప్పున అందజేస్తుంది. అదేవిధంగా 20వ విడత పంట సహాయ నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఆగస్టు 2వ తేదీన దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఆగస్టు 2వ తేదీన వారణాసిలో ఉంది. అదే రోజు వారణాసిలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పిఎంకెవై నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కో రైతుకు ఐదువేల రూపాయలు కలిపి మొత్తం అదే రోజు 7000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లు సమాచారం.
MOST READ :
-
Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!
-
Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. యూరియా పంపిణి పై అలా చేస్తే కఠిన చర్యలు..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!
-
Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!
-
TG News : తెలంగాణలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ.1000.. దరఖాస్తు ఇలా..!









