తెలంగాణBreaking Newsవ్యవసాయంసంక్షేమం
TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో భూమి లేని రైతులకు ప్రభుత్వం వారి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. భూమిలేని నిరుపేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కు కల్పిస్తూ వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రకటన జూన్ 2వ తేదీన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు భూభారతి లో పొరపాట్లు జరగకుండా చూడాలని, గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.









