Nalgonda : జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్..!
Nalgonda : జిల్లా జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడిన మానవ హక్కుల కమిషన్ చైర్మన్..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా జైలులో ఖైదీలకు అన్ని వసతులతో పాటు, జైలు పరిశుభ్రంగా ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ తెలిపారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం అయన నల్గొండ జిల్లాకేంద్రం లోని జిల్లా జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని అన్నిటిని పరిశీలించారు.
అంతేకాక ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు.
జైలులో సౌకర్యాలన్నీ పరిశీలించడం జరిగిందని, అన్ని బ్యారక్స్ ను పరిశీలించానని, అధికారుల ప్రవర్తన, సౌకర్యాలు, తదితర వివరాల గురించి ఖైదీలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందని, జిల్లా జైలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా, నిబంధనల ప్రకారం ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ముఖ్యంగా ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగున్నాయని ,వంటగది బాగుందని , జైలులోఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఖైదీల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు.
ఖైదీలలో కొంతమంది నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని తెలిపారు. నియమ ,నిబంధనల ప్రకారం జిల్లా జైలును బాగా నిర్వహిస్తుండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ జైలులో ఖైదీల వివరాలు , సౌకర్యాలు, ఏర్పాట్లు, తదితర వివరాలను తెలియజేశారు. ఖైదీల సంక్షేమంలో భాగంగా వారి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించారు. జిల్లా జైలర్ బాలకృష్ణ ఉన్నారు.
అంతకు ముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కు నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, డిఎస్పి శివరామిరెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు పూల మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న సేవలు, సంక్షేమ హాస్టల్ల ద్వారా అందిస్తున్న సేవలు, ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
అడిషనల్ ఎస్పీ రమేష్ ,ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ,డి.ఎస్.పి శివరాంరెడ్డి, నల్గొండ తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు వీరి వెంట ఉన్నారు.
MOST READ :
-
Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!
-
SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!
-
అఘోరి ఆడా.. మగా.. తేల్చి చెప్పిన వైద్యులు.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!
-
Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!









