మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తేనే వారి భవిష్యత్తు మెరుగు..!
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తేనే వారి భవిష్యత్తు మెరుగు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్, మంచినీటి సౌకర్యాలతో పాటు పరిసరాల పరిశుభ్రతకు నా వంతుగా కృషి చేస్తానని స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలోని బకల్ వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన టాయిలెట్స్ ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడం ద్వారా వారి భవిష్యత్తు మెరుగుపరచిన వాళ్ళు అవుతారని అన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించడం నా లక్ష్యం అన్నారు. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన డాన్స్, ఎన్సిసి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!










