తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

నల్లగొండ, మన సాక్షి :

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులందర్నీ రుణవిముక్తులను చేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఐఎం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు జిల్లా కలెక్టరేటు ముందు ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని, ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

రూ.2 లక్షల రుణమాఫీ అనేది సాహౌసోపేతమైనదేనని, దాన్ని తాము స్వాగతించామన్నారు. తొలుత ప్రతి రైతుకూ రూ.2లక్షలు అని చెప్పిన ప్రభుత్వం తర్వాత రైతు కుటుంబానికి అని మాట మార్చిందని, అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదన్నారు. రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 567లో అనేక నిబంధనలు విధించడం వల్ల రైతులు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఉందన్నారు.

ఇప్పటి వరకు రూ.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ 40శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్ధానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతిరైతుకు రుణమాఫీ వర్తింపచేయాలన్నారు. అలాగే రైతుభరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు జిల్లాలో క్యాబినేటు సబ్‌కమిటీ అభిప్రాయాలు సేకరించిన రైతు పెట్టుబడికి భరోసా నిధులను ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు.

విధివిధానాలు ఎపుడైనా తయారు చేసుకోవచ్చు వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనది కాబట్టి రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుభీమా స్కీమ్‌కు ప్రభుత్వం వెంటనే ప్రిమీయం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం లాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తే తగిన సమయంలో రైతులు ప్రభుత్వానికి బుద్దిచెబుతారని అన్నారు.

ఆందోళనలో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం నల్లగొండ జిల్లాలో రైతులకు పట్టెదారుపాస్‌ పుస్తకాలు 5 లక్షల 42 వేల 306 వుండగా యిప్పటి వరకు 1,71,781 మంది రైతులకకు రుణమాఫీ అయిందన్నారు.

మిగిలిన రైతులకు ఎప్పటి వరకకు ఆవుతుందన్నారు. ప్రభుత్వం రేషన్‌ కార్డులేదని, గ్రూపు పోటో లేదని తదితర కారణాలు చూపుతున్నారని, ఈ కారణాలు సమంజసంగా లేదన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. పహాణీలు, పాస్‌బుక్‌ల మీద తీసుకుని ఇప్పుడు పాస్‌బుక్‌లు లేని వారి రుణాలు కూడా మాఫీ చేయాలని కోరారు.

రైతుబంధు నేరుగా రైతుల ఖాతాలో జమవుతున్నప్పుడు రుణమాఫీకి సాంకేతిక సమస్యలను చూపడం సరికాదని సూచించారు. రుణమాఫీ కాక కొందరు, రుణమాఫీ అయినా కొత్త రుణాలు మంజూరు కాక మరికొందరు వ్యవసాయక్షేత్రాలను వదిలి బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా షరతులు లేకుండా ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ధర్నాలో సిపిఐఎం నాయకులు బండ శ్రీశైలం, కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్‌ హాషం, సిహెచ్‌ లక్ష్మినారాయణ, వి వెంకటేశ్వర్లు, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, అవిశెట్టి శంకరయ్య, జిట్టా నగేష్‌, బొజ్జ చిన్నవెంకులు, ఎం రవినాయక్‌, కంబాలపల్లి ఆనంద్‌, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండెంపల్లి సత్తయ్య, రొండి శ్రీనివాస్‌, వెంకన్న, నాంపల్లి చంద్రమౌళి, మల్లం మహేష్‌, సరోజ, పద్మ, సైదులు, మన్నెం బిక్షం, గోవర్ధన, కుంభం క్రిష్ణారెడ్డి, పెద్దులు, ఆశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజావాణికి అనూహ్య స్పందన.. సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు..!

Mlc Kavitha : ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. 10 రోజులపాటు అక్కడే..!

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

మరిన్ని వార్తలు