Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : ఇందిరమ్మ ఇళ్ల ధరఖాస్తుదారులకు  సమస్యలుంటే.. వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్.. జిల్లా కలెక్టర్ వెల్లడి.!

District collector : ఇందిరమ్మ ఇళ్ల ధరఖాస్తుదారులకు  సమస్యలుంటే.. వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్.. జిల్లా కలెక్టర్ వెల్లడి.!

నల్లగొండ, మన సాక్షి :

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు ఫోన్ చేసి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆమె అన్నారు.

గురువారం ఆమె నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం బట్టు గూడెం, పెద్దఊర మండల కేంద్రాలలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రజలు, సర్వే బృందాలకు సర్వే సందర్భంగా ఏవైనా సందేహాలు తలెత్తినా లేదా సాఫ్ట్ వేర్ సమస్యలు ఉత్పన్నమైనట్లయితే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని, అలాగే ఈ -జిల్లా మేనేజర్ కు తెలియజేసి వాటిని అధిగమించాలని చెప్పారు.

చిన్న చిన్న సమస్యలను స్థానిక ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సందర్భంగా దరఖాస్తుదారు లేని సమయంలో పాక్షికంగా అప్లోడ్ చేయాలని, దరఖాస్తుదారుకు సమాచారం అందించి వారు అందుబాటులో ఉన్నప్పుడు ఫోటోతో సహా పూర్తి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని సర్వే బృందాలకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సర్వే సందర్భంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన దరఖాస్తుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి అప్లోడ్ చేసిన వివరాలను ఆన్లైన్లో పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్, పెద్దవూర ఎంపీడీవో, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు