Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు జూన్ 16వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.
తొలి రోజు రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు 2,349.83 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ కాని రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిధులు ఖాతాలలో పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
18 నెలల కాలంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర, బోనస్, రైతు బీమా పథకాలకు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ కు సంవత్సరానికి 17వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సోలార్ విద్యుత్తు వైపు రైతులు మొగ్గితే లాభాలు గడించవచ్చు అన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, సౌకర్యాలను కూడా అందించేందుకు అధికారులకు ఆయన సూచించారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!
-
WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!









