Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!

Karimnagar : వైద్యం కోసం వెళ్తే.. మత్తు ఇచ్చి యువతీపై అఘాయత్నం..!
కరీంనగర్, మనసాక్షి :
వైద్యోనారాయణోహరి అని భావించే కొన్ని ఆసుపత్రుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతీ పై జరిగిన అఘాయత్నం ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువతి ఆరోగ్యం బాగోలేదని కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇన్ పేషంట్ గా అడ్మిట్ అయ్యింది. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతిపై ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డట్లు సమాచారం.
అయితే మత్తు నుంచి కాసేపటికి కోలుకున్న యువతి వెయిటింగ్ హాల్లో నిద్రిస్తున్న తన తల్లికి చెప్పింది. దీంతో వారిద్దరూ హాస్పిటల్ సిబ్బందిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. బాధితురాలు కరీంనగర్ మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
MOST READ :
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!
-
CM Revanth Reddy : సామాన్యుడిలా సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)
-
Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..!
-
Drinking Water : ఖాళీ బిందెలతో త్రాగినీటి కోసం మహిళలు పంచాయతీ కార్యాలయం ముట్టడి..!









