Breaking NewsTOP STORIESజాతీయంతెలంగాణ

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే మీరు కూడా ప్రతి నెల 5000 రూపాయలను పొందవచ్చును. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. మీకు తెలుసా..? తెలియకుంటే ఈ కథనం చదివి తెలుసుకోండ. ప్రతి ఒక్కరు దీనిని సద్వినియోగం చేసుకో వచ్చును. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాల తర్వాత 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చును. వివరాలు తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ పథకం ద్వారా ఈ సౌలభ్యం అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం 2015- 16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. అసంఘటిత కార్మికులను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని అమలు చేశారు. 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ప్రతినెల పింఛన్ పొందవచ్చును. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకానికి అర్హులే. అందుకోసం మీరు నామమాత్రపు ప్రీమియం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలంటే మీకు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాలి. 60 సంవత్సరాల తర్వాత ఈ పథకం ద్వారా పింఛన్ పొందాలంటే నామమాత్రపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అవేంటంటే..

ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసులో అటల్ పెన్షన్ పథకంలో చేరినట్లయితే పదవీ విరమణ సమయంలో అతనికి 5000 రూపాయలు పొందాలని ఉంటే ప్రతి నెల 210 ప్రీమియంను చెల్లించాలి. అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ పొందడానికి 42 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టండి సరిపోతుంది.

ఒక కుటుంబంలో భార్యాభర్తలు కూడా ఈ పథకానికి అర్హులే. భార్యాభర్తలిద్దరూ అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరినట్లయితే ప్రతినెల 210 ప్రీమియం చెల్లించినట్లయితే 60 ఏళ్ల తర్వాత ప్రతినెల ఇద్దరు కలిసి 10 వేల రూపాయల పింఛన్ పొందవచ్చును.

MOST READ :

BREAKING : దామరచర్ల వైటిపిఎస్ లో రూ.1.49 కోట్ల విలువైన అల్యూమినియం షీట్ల చోరీ.. చాకచక్యంగా చేదించిన పోలీసులు..!

BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..!

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

మరిన్ని వార్తలు