Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Devarakonda : వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలు.. అధికారుల నిలిపివేత..!

Devarakonda : వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ నిర్మాణాలు.. అధికారుల నిలిపివేత..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సర్వే నెం. 753లో ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు టి పి ఓ శ్రీధర్, టి పి బి ఓ వర్షిత నిలిపివేశారు. ఈ చర్యతో అక్రమ నిర్మాణాల పట్ల తమ నిబద్ధతను అధికారులు మరోసారి చాటిచెప్పారు.

వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని నిర్మాణ పనులను నిలిపివేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ అక్రమ నిర్మాణం గురించి అందిన ఫిర్యాదులపై లోతైన విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇది పట్టణ ప్రగతికి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

అధికారుల ఈ చర్యను ప్రజలు, వివిధ సంఘాల నాయకులు స్వాగతించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఇలాంటి కఠిన చర్యలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనతో దేవరకొండలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారని స్పష్టమైంది.

MOST READ :

  1. Miryalaguda : రాష్ట్రస్థాయి జూడో పోటీలకు సెయింట్ జాన్స్, శిష్య స్కూల్ విద్యార్థుల ఎంపిక..!

  2. Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!

  3. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  4. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

మరిన్ని వార్తలు