తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా
Suryapet : బాసర త్రిపుల్ ఐటీలో ఇమాంపేట మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!

Suryapet : బాసర త్రిపుల్ ఐటీలో ఇమాంపేట మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!
సూర్యాపేట రూరల్, మన సాక్షి :
బాసర త్రిపుల్ ఐటీ 2025 ప్రవేశ ఫలితాలలో సూర్యాపేట జిల్లా నుండి 30 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. అందులో ఇమాంపేట మోడల్ స్కూల్ నుండి 8 మంది విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని ప్రిన్సిపల్ బీసు రమేష్ తెలిపారు.
ఎంపికైన విద్యార్థులు ఈశ్వర్, సాయి మాధురి, జ్యోతి, రోహిత్, మోహన్ చంద్, హరిని, సౌజన్య, లిఖిత లకు సహకరించిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు.
MOST READ :









