District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఆకస్మిక తనిఖీ..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఆకస్మిక తనిఖీ..!
జగిత్యాల, (మన సాక్షి) :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహణ, సౌకర్యాలు మరియు ధాన్యం వాహనాల రాకపోకలను పరిశీలించి, ట్రక్‌షీట్లలో నమోదైన ధాన్యం వివరాలను తనిఖీ చేసి, గత సారి వచ్చిన వడ్లతో పోల్చి ప్రస్తుత సీజన్ రికార్డులను విశ్లేషించారు.
రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు చేరిన మొత్తం ధాన్యం,ఇంకా ఎంత ధాన్యం రావాల్సి ఉంది అనే అంశాలను సమీక్షించారు. కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు.
రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతమైన కొనుగోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్‌మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని, లారీ రవాణాలో ఎలాంటి షార్టేజ్ లేకుండా నిశితమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.
ధాన్యం బరువు కొలతలు,తేమ శాతం పరీక్షలు, సంచుల సీలింగ్, రసీదుల జారీ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులకు త్రాగునీరు, నీడ, టోకెన్ వ్యవస్థ, రద్దీ తగ్గించే చర్యలు వంటి సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. అధికారులు నిరంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ, సెంటర్ ఇంచార్జి లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు సజావుగా జరిగేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీసీఓ మనోజ్ కుమార్, ఎంఆర్ఓతో పాటు సంబంధిత శాఖ అధికారులందరూ పాల్గొన్నారు.
MOST READ :
-
Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!
-
TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)
-
Penpahad : ఆర్డీవో హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..!
-
ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!









