తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

Khammam : ఖమ్మం జిల్లాలో పొంగిన పాలేరు.. రాకపోకలు బంద్..!

Khammam : ఖమ్మం జిల్లాలో పొంగిన పాలేరు.. రాకపోకలు బంద్..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వలన గ్రామాలు జలమయం అయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని సుర్దేపల్లి-సూర్యాపేట జిల్లా, పాలారాం గ్రామాల మధ్య ఉన్న పాలేరు పొంగి పొర్లుతుంది. చప్టా పై నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు.

ఎంపీడీఓ యం.యర్రయ్య, తహశీల్దార్ ఇమ్రాన్, ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు లు ఘటనా స్థలం కు చేరుకుని రహదారిని దగ్గర ఉండి బంద్ చేయించారు. రహధారి కి అడ్డంగా వళ్ల కంచె ఏర్పాటు చేశారు. అదే విధంగా సుర్దేపల్లి-కిష్టాపురం, బుద్దారం-రాయగూడెం, నాచేపల్లి గ్రామాల మధ్య ఉన్న రహధారుల ను మండల అధికారులు పర్యవేక్షించారు.

బుద్దారం వాగు చపా వద్ద తాటి మొద్దులు అడ్డు పడి నీరు భారీగా నిలవటంతో సానిక పంచాయతీ కార్యదర్శి జెసీబీ వాటిని తొలిగించారు. దీంతో వరద ఉదృతి తగ్గింది. రాయగూడెం-బుద్ధారం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.

చెరువుమాధారం చెరువు నుంచి ఏపీ కి 380 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఏపీలో వరదల ఉదృతం ఎక్కువ కావటంతో అక్కడి అధికారుల సూచన మేరకు ఇరిగేషన్ డీఈఈ మన్మధరావు, ఏఈ నరేష్ లు 100 క్యూసెకుల నీటిని తగ్గించారు. ప్రస్తుతం చెరువు నీటి మట్టం 7.5 అడుగులకు చేరింది.

మండలంలో చెరువులు, కుంటలు జలమయంగా మారాయి.పంచాయతీలలో వీధులన్ని బురదమయంగా మారాయి. మొత్తం మీద మండల ప్రజలు అతలాకుతమయ్యారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమతం చేస్తున్నారు.

LATEST UPDATE : 

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు