Sarpanch Elections : సర్పంచ్ బరిలో అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు..!

Sarpanch Elections : సర్పంచ్ బరిలో అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు..!
కంగ్టి,, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ఘనపూర్ గ్రామం తడ్కల్ ఆమ్లేట్ విలేజ్ గా ఉండేది.బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా 2019లో ఘనపూర్ గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. 2019 సర్పంచ్ ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో ఘనపూర్ సర్పంచ్ బరిలో అప్పుడు భర్తలు కృష్ణ ( బీఆర్ఎస్) కాంగ్రెస్ తరపున లక్ష్మణ్ పోటీపడితే, 26 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా లక్ష్మణ్ విజయం సాధించాడు.
2025 ఈసారి బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో వారి భార్యలు కూరాకుల శ్వేత ( బీఆర్ఎస్) సంతపరం జ్యోతిక ( కాంగ్రెస్) బరిలో నిలిచారు. తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాను చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ధీమగా ఉండగా, బీఆర్ఎస్ యువ నాయకుడు కృష్ణ మాట్లాడుతూ… గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచిచూడాలి.
By : Jaleel Rusthum
98490 96202
MOST READ
-
EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!
-
ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!
-
Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!









