Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోరం.. హాస్టల్ విద్యార్థిని వ్యవసాయ పనులకు తీసుకెళ్లిన ట్యూటర్.. బావిలో పడి మృతి..!
Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోరం.. హాస్టల్ విద్యార్థిని వ్యవసాయ పనులకు తీసుకెళ్లిన ట్యూటర్.. బావిలో పడి మృతి..!
అనంతగిరి, మన సాక్షి
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో ఘోరం చోటుచేసుకుంది. హాస్టల్ విద్యార్థిని ట్యూటర్ వ్యవసాయ పనులకు తీసుకెళ్లగా బావిలో పడి మృతి చెందిన సంఘటన సంచలనం కలిగించింది. అనంతగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శాంతినగర్ గ్రామంలో ఉన్నటువంటి సమీకృత బాలుర వసతి గృహం చెందిన విద్యార్థి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన జరిగింది.
తోటి విద్యార్థుల తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్లో ట్యూషన్ మాస్టర్ గా పనిచేస్తున్న శాంతినగర్ గ్రామానికి చెందిన బత్తిని వీరబాబు అను వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం తనతో పాటుగా తన వ్యవసాయ పొలం వద్దకు తీసుకువెళ్లి చెట్లను నరికించారు.
అనంతరం వ్యవసాయ బావి లో ముందుగా ఈత కొడుతున్న వీరబాబు ఆ పిల్లవాడిని నేనున్నానులే నువ్వు దూకు అనగానే ఆ పిల్లవాడు దూకడంతో ఎంతసేపటికి కూడా పైకి తేలక పోవడంతో అక్కడనుండి వీరబాబు పరారీ అయినట్లు తెలిపారు.
ఇట్టి సంఘటన వద్దకు పోలీసు వారు హుటాహుటిన చేరుకొని రిస్క్యూటిమ్ ద్వారా తిరుమలేష్ మృతదేహాన్ని బయటకి తీశారు. మృతి చెందిన విద్యార్థి చింతాలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు.
MOST READ :
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లపై లేటెస్ట్ అప్డేట్.. అదిరిపోయే శుభవార్త..!
-
ACB : ఏసీబీ చరిత్రలో రికార్డు.. రూ. 600 కోట్ల అక్రమార్చన, వెనుక ఉన్నదెవరు..!
-
TG News : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
CM Revanth Reddy : రైతు పండుగ వేదికగా రైతులకు శుభవార్త.. స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్..!









