పరిశ్రమలో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి..!

హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో కోవలేంట్ పరిశ్రమలో మంగళవారం అకస్మాత్తుగా రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది .

పరిశ్రమలో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి..!

హత్నూర, మన సాక్షి:

హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో కోవలేంట్ పరిశ్రమలో మంగళవారం అకస్మాత్తుగా రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది . ఇద్దరు వ్యక్తులు మృతి మరో ఇద్దరూ వ్యక్తులకు గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎస్ ఐ గురువారం తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలం గుండ్ల మచునురు గ్రామ శివారులో ఉన్న కోవలెంట్ పరిశ్రమ లో మంగళవారం రియాక్టర్ దగ్గర అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు పూర్తిగా కాలి హత్నూర గ్రామానికి చెందిన నీరుడి వినోద్ కుమార్ తండ్రి నీరుడి బిక్షపతి 26 , ముదిరాజ్ మృతి చెందాడు, ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు పూర్తిగా కాలి గాయపడ్డారు . గాయపడి డి ఆర్ డి ఓ , అపోలో ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ అందులో ఒక వ్యక్తి లాల్ బాబు తూరీ ( 37) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గురువారం 4 గంటలకు మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులు ఫాదర్ మారండి (35), స్వాధీన రాజమహల్ (56) జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు చికిత్స పొందుతున్నారని హత్నూర ఎస్ ఐ. కే సుభాష్ తెలిపారు.