Breaking Newsతెలంగాణ

High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!

High court : సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల జీవో 46 పై హైకోర్టులో విచారణ..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో 46 ను జారీ చేసింది. కాగా ఈ జీవో ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది.

బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 17% కు కుదించారని పిటీషన్ దాఖలు చేశారు. కాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ వాదనలు వినిపించారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ జరపాలని ఆయన కోరారు.

అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. బీసీలలో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు విన్న సీజే ధర్మాసనం శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొన్నది.

MOST READ : 

  1. Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TG News : నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ..!

  3. TG News : సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్..!

  4. District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!

మరిన్ని వార్తలు