Result : తెలంగాణలో ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే..?

Result : తెలంగాణలో ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే..?

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఫలితాలు కూడా వెలుబడ్డాయి. ఇకపై తెలంగాణలో రిజల్ట్ ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తుంది.

 

అధికారులు… ఫలితాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఉండేందుకు అన్ని సరిచూశాకనే ఫలితాలు విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు ఈనెల 10వ తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఈనెల 17వ తేదీన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు నిర్వహించారు. మొత్తం మొదటి ద్వితీయ సంవత్సరం కలిపి 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వారిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల 82 వేల 677 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరం నాలుగు లక్షల 65 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ అనుకున్న ప్రకారం పూర్తయింది.

 

ఇక పదవ తరగతి పరీక్షలు మాత్రం ఏప్రిల్ మూడో తేదీన ప్రారంభం కాగా 12వ తేదీన పూర్తయ్యాయి. నాలుగు లక్షల 84 వేల 384 విద్యార్థులు పరీక్షలు రాశారు. తెలుగు పేపర్, హిందీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచనం కలిగించిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలు యధావిధిగా నిర్వహించారు. ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.