ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!

AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్ లో హృదయ విధారకమైన ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు కుమారులను బకెట్ల నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో సుబ్బారావు నగర్ లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన వానపల్లి చంద్ర కిషోర్ కాకినాడ జిల్లా వాకాలపుడి లోని ఓ ఎన్ జి సి కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. సుబ్బారావు నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటవ తరగతి చదివే జోషి (7) యూకేజీ చదివే నిఖిల్ (6) కుమారులు ఉన్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవల పాఠశాల మార్పించారు.

శుక్రవారం హోలీ సందర్భంగా చంద్ర కిషోర్ భార్య పిల్లలను తీసుకొని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్ళాడు. భార్యను అక్కడే ఉండాలని చెప్పి పిల్లలకు యూనిఫామ్ కొలతలు ఇవ్వడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు.

సమయం గడుస్తున్నా భర్త, పిల్లలు రాకపోవడంతో ఆమె ఫోన్ చేసింది. చంద్రశేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాగా తోటి ఉద్యోగులతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళింది. ఎంతసేపు డోర్ కొట్టినా తీయలేదు. కిటికీలోంచి లోపలికి చూసిన ఆమెకు తన భర్త ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. దాంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు కుమారుల కాళ్లు చేతులకు కట్లు ఉన్నాయి. వాళ్ల తలలు నీటితో నిండిన బకెట్లలో మునిగి ఉన్నాయి. అది చూసిన తల్లి తనుజ గుండెలు పగిలేలా రోదించింది.

భర్త పిల్లలను చూసి కన్నీరుగా విలపించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్ర కిషోర్ సూసైడ్ నోట్లో రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

  1. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  2. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  3. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  4. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

  5. Teacher : రక్తం వచ్చేలా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..!

మరిన్ని వార్తలు