Breaking Newsతెలంగాణరాజకీయం

లెక్క తప్పుతోందా.. ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ సుదీర్ఘ మంతనాలు..?

లెక్క తప్పుతోందా.. ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ సుదీర్ఘ మంతనాలు..?

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ లెక్క తప్పుతుందా..? ఇటీవల బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి ఆ గూటికి వెళ్ళనున్నారా..? ఒక్కొక్కరుగా తిరిగి బీఆర్ఎస్ కు చేరుతున్నారా..? అనే విషయం కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదిలో టెన్షన్ మొదలైందని చెప్పవచ్చును.

ఇప్పటి వరకు పదిమంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. దాంతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్ లో చేర్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి సుదీర్ఘ మంతనాలు చేసినట్లు సమాచారం.

గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శాసనమండలి స్పీకర్ గుత్త సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తోపాటు పార్టీ మారిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో తప్ప మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారితో రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం.

నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రాధాన్యత ఇస్తామని, అదేవిధంగా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు కూడా ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇస్తామని హామీలు ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా బీఆర్ఎస్ నుంచి వచ్చి తిరిగి మళ్లీ బీఆర్ఎస్ కు వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : 

చింతపల్లి రైతు వేదికలో భూ నిర్వాసితుల ఆందోళన..స్పెషల్ కలెక్టర్ శ్రీదేవిని అడ్డుకున్న రైతులు..!

Nalgonda : పచ్చని చెట్లు బొగ్గు పాలు.. యదేచ్ఛగా బొగ్గు బట్టీల నిర్వహణ..!

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

మరిన్ని వార్తలు