అమెరికాలో మృతి చెందిన ఐశ్వర్యకు నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

అమెరికాలో మృతి చెందిన ఐశ్వర్యకు నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

అమెరికాలోనీ టెక్సాస్ సమీపంలో ఉన్న డల్హాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుమారీ ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు.

 

అమెరికాలోనీ టెక్సాస్ సమీపంలో ఉన్న డల్హాస్ లో ఉన్నత విద్యానభ్యసిస్తున్న కుమారి ఐశ్వర్య రెడ్డి ఆచూకీ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకు రాగ తక్షణం స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అమెరికా కాన్సులేట్ తో సంప్రదింపులు జరిపి ఆచూకీ కనుగొనడం తో పాటు జరిగిన ఘోరం తెలియడంతో నిశ్చేష్టులైన మంత్రి జగదీష్ రెడ్డి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తోసుకొచ్చి ఐశ్వర్య రెడ్డి  పార్థివ దేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు చేపట్టిన విషయం విదితమే.

 

ఈ క్రమంలోనే గురువారం నగరానికి చేరుకున్న ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ ,శానంపూడి సైదిరెడ్డి లతో కలసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.