Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!

Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!
మనసాక్షి :
మన దగ్గర ఆల్కహాల్‌ను మందు అని పిలుచుకుంటారు. ఎవరి దగ్గరైనా కొంచెం ఆల్కహాల్ వాసన రాగానే…ఏంటి మందేసి వచ్చావా అని అడుగుతారు. చాలా ఇళ్ళల్లో…చాలా చోట్ల మద్యం నిషేధం. ఇది అందరికీ తెలిసిన విషయంమే. బీర్, విస్కీ, రమ్, ఓడ్కా, జిన్, రెడ్‌వైన్, బ్రాందీ, మందు ఏ రూపంలో ఉన్నా.. మందు.. మందే. మద్యం ఏ రూపంలో సేవించినా ఆరోగ్యానికి హానికరం. అందుకే చాలా చోట్ల మద్యాన్ని నిషేధిస్తారు.
ఆల్కహాల్ శాతం తక్కువగా ఉందనుకున్నారో ఏమో అక్కడ బీర్‌ను ఆల్కహాల్‌గా గుర్తించలేదట. కొన్ని చలి దేశాల్లో బీరుని నిత్యావసర వస్తువుగా ఉపయోగిస్తారు. చెక్ రిపబ్లిక్‌లో బీర్‌ను ఎక్కువగా తాగతారట. ఆ తర్వాత స్థానాల్లో… ఆస్ట్రియా, లూథియానా, రొమానియా, పోలాండ్, ఇస్టోనియా, జర్మనీ, స్పెయిన్, నాంబియా, క్రోషియా, బీరును నిత్యావసర వస్తువుగా వాడటంలో టాప్ టెన్‌లో నిలిచాయి.
అయితే యూకేలో కూడా ఎక్కువగా బీరును తాగుతారనే అపవాదు ఉన్నా…25వ స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా 17వ స్థానం దక్కించుకుంది. డెన్మార్క్‌లో కూడా రోజూ బీర్లను నిత్యావసరంగా తాగడం అక్కడి జనాలకి అలవాటు.
మన పక్కనే ఉన్న రష్యా దేశంలో కూడా బీరును 2011 వరకు ఆల్కహాల్‌గా చూడలేదట. అక్కడ అప్పట్లో ప్రతి నిత్యం కూల్ డ్రింకుల్లాగే బీర్లను తాగేవారట. ఇప్పుడు రష్యాలో బీరును ఆల్కహాల్ అంటున్నప్పటికీ…దానిలో వైన్ కంటే చాలా తక్కువ ఆల్కహాల్ వాడుతారట. వైన్‌లో 9 నుంచి 18 శాతం ఆల్కహాల్ ఉంటుంది.
అయితే ఇప్పుడు రష్యాలో తాగే బీర్లలో 9 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉంటుందన్న మాట. ఏది ఏమైనా..హెచరిక మాత్రం మరిచిపోకండి.. ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న మాట.
Reporting :
Mahipal Reddy, Hyderabad
MOST READ :
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Youtube Videos : ఇంటర్నెట్ లేకుండానే యూట్యూబ్‌లో వీడియోలు చూడొచ్చా.. సూపర్ ఫీచర్ మీకు తెలుసా..!
-
Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!









