ఐటి సోదాల్లో రూ. 5 కోట్లు స్వాధీనం..?

నల్గొండ జిల్లాలో ఐటి అధికారుల సోదాల్లో ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వైదేహి తోపాటు మహాతేజ రైస్ మిల్లుతో పాటు మరికొన్ని రైస్ మిల్లులలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఐటి సోదాల్లో రూ. 5 కోట్లు స్వాధీనం..?

నల్లగొండ , మన సాక్షి :

నల్గొండ జిల్లాలో ఐటి అధికారుల సోదాల్లో ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వైదేహి తోపాటు మహాతేజ రైస్ మిల్లుతో పాటు మరికొన్ని రైస్ మిల్లులలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

కాగా రైస్ మిల్లులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నిర్వహించిన తనిఖీలలో ఐటీ అధికారులు సుమారు ఐదు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిడమనూరు, మిర్యాలగూడ, త్రిపురారం, హాలియా మండలాలలోని రైస్ మిల్లులలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.

వ్యాపారుల వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులు ఎన్నికల కోసమే ఉంచారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ALSO READ :