నల్గొండ :  జైలుకు వెళ్లి వచ్చినా.. తీరు మారలే..! ఒకే వ్యక్తి పై 68 కేసులు

నల్గొండ :  జైలుకు వెళ్లి వచ్చినా.. తీరు మారలే..! ఒకే వ్యక్తి పై 68 కేసులు

నల్గొండ , మనసాక్షి :

వరుస దొంగతనాలకు పాల్పడుతున్నఅంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్
వీరి వద్ద నుండి సుమారు (32 లక్షల విలువ గల) 51తులాల 9 గ్రాముల బంగారు ఆబరణాలు, 34 తులాల వెండి,మూడు ద్విచక్ర వాహనాలు 2 సెల్ ఫోన్లు ,1 టాబ్ స్వాదీనం.
 రాత్రి వేళలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్
పి‌డి యాక్ట్ లో జైల్ కి వెళ్ళి వచ్చిన నిందితుడు రుద్రాక్ష శ్రీను, గతంలో 50 కి పైగా నిందితుని పై కేసులు, మరలా 18 కేసులలో అరెస్ట్.

నిందితుల వివరాలు : 

1) రుద్రాక్ష శ్రీను, s/o బిక్షం వయస్సు 30 సంవత్సరాలు. occ. ఆటో డ్రైవర్, గ్రామం యెడవెల్లి, మండలం కనగల్, నల్గొండ జిల్లా.
2) శనివారపు భాస్కర్ రెడ్డి, s/o ఉషాపతి రెడ్డి వయస్సు .25 సంవత్సరాలు., Occ. హోటల్ వర్కర్. r/o కొత్తపేట, శ్రీశైలం,కర్నూల్ జిల్లా.
3) యెల్కపాటి అరుణ్ @ ఆరు s/o విశాక్ వయస్సు. 23 సంవత్సరాలు., Occ.పేయంటర్, నంద్యాల జిల్లా

.
దొంగ సొత్తు విక్రయించిన నిందితుల వివరాలు :

1) ఆలమూరి సంజీవ్ రెడ్డి ,వయస్సు.: 31 సంవత్సరాలు, Occ: ప్రైవేట్ ఉద్యోగం r/o: ప్రొద్దుటూరు, రాయచోటి జిల్లా, AP రాష్ట్రం.
2) కాలవల శ్రవణ్ @ మున్నా s/o వెంకటేష్ వయస్సు.:30 సంవత్సరాలు.,occ. లేబర్ r/o. H-No.2-3-734/4 ,జిందతిలిస్మత్ నగర్, VI నంబర్ చౌరస్తా హైదరాబాద్.,
3) గురజాల ఉదయ్ కిరణ్ @ Udai s/o విజయ్ సారధి ,వయస్సు.:22 సంవత్సరాలు.Occ.డ్రైవరు కొత్తగూడెం , ఇల్లందు మండలం ,ఖమ్మం జిల్లా .
4) సాండ్రపాటి ప్రేమ్ కుమార్ s/o నాగేశ్వర్ రావు వయస్సు.22 సంవత్సరాలు,Occ.:బిజినెస్ r/o వెస్ట్రన్ కాలనీ ,సున్నీపెంట, శ్రీ శైలం ,కర్నూల్ జిల్లా ,రాష్ట్రం AP.

నల్లగొండ జిల్లాలో వరస దొంగతనాలు జరుగుతున్నా క్రమంలో జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల గురించి గాలిస్తూ తేదీ 15-05-2023 ఉదయం 06 గంటలకు పానగల్ బై పాస్ వద్ద అనుమానస్పదంగా ఉన్నాడు

 

అనే నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ 2 టౌన్ సి.ఐ పి.యన్.డి. ప్రసాద్,సి‌సి‌ఎస్ సి‌ఐ జితేందర్ రెడ్డి ,వెంకటేశ్వర్లు,సి‌సి‌ఎస్ యస్.ఐ మహేందర్, నల్గొండ టూ టౌన్ ఎస్‌ఐ లు రాజశేకర్ రెడ్డి,సైదులు,వారి సిబ్బంది మరియు సి‌సి‌ఎస్ సిబ్బంది విష్ణువర్దన్ గిరి ,రామ్ ప్రసాద్,మోహిన్ పాషా, కలిసి నిందితుణ్ణి పట్టుకొని విచారించగ, రుద్రాక్ష శ్రీను, s/o బిక్షం వయస్సు 30 సంవత్సరాలు. occ. ఆటో డ్రైవర్, గ్రామం యెడవెల్లి, మండలం కనగల్, నల్గొండ జిల్లా.
చెడు వ్యసనలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇతని పై గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 50 కి పై కేసులలో నిందితుడుగా ఉన్నాడు.

 

ఇతని పైన హైద్రాబాద్ కుల్సుంపుర పోలీసు స్టేషన్ నుండి పి.డి ఆక్ట్ లో జైలుకి వెళ్ళి వచ్చినా తన ప్రవర్తనలో మార్చుకోకుండా నల్లగొండ పట్టణంలో 2 టౌన్ 1 టౌన్,భువనగిరి,చౌటుప్పల్, ఇబ్రహింపట్నం, మహబూబ్ నగర్, కడప, తదితర ప్రాంతాలలో రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సుమారు 18 కి పైగా కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇతని తో పాటు బాస్కర్ రెడ్డి, అరుణ్ లు కలిసి దొంగతనాలు చేసేవారని తెల్పగా ఇతని వద్ద నుండి 2 తులాల బంగారం స్వాదినం చేసుకొని ఈ నెల 15 వ తేదీన రిమాండుకి పంపనైనది.

ప్రదాన నిందితుడు అయిన శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు బాస్కర్ రెడ్డి,అరుణ్ ల గురించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతుకుతుండగా ఈ రోజు అనగా తేదీ 20-05-2023 ఉదయం 7 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు నల్లగొండ బస్ స్టాండ్ వద్ద పట్టు బడి చేసి విచారించగా శ్రీను తో కలిసి గత రెండు సం లుగా వివిద ప్రాంతాలలో దొంగతనాలు చేసేవారమని, వాటిని తెలిసిన వారికి తక్కువ దరకు అమ్మడంగాని, కుదవ పెట్టడం గాని చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారమని ఒప్పుకున్నారు. నిందితుల నుండి దొంగ సొత్తు కొన్న నలుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది.

నిందితుల పై నమోదు అయిన కేసుల వివరములు :

01 .నల్గొండ టూ టౌన్ పి‌ఎస్ 05
02. నల్గొండ 1 టౌన్ పి‌ఎస్ 05
03 .భువనగిరి టౌన్ పి‌ఎస్ 02
04 .చౌటుప్పల్ పి‌ఎస్ 03
05 .ఇబ్రాహిం పట్నం పి‌ఎస్ 01
06.మహబూబ్ నగర్ టౌన్ పి‌ఎస్ 01
07. కడప టౌన్ పి‌ఎస్ 01
మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 18 కేసులు

నిందితుల నుండి స్వాదినపర్చుకున్న వాటి వివరాలు :

వీరి వద్ద నుండి సుమారు (32 లక్షల విలువ గల) 51తులాల 9 గ్రాముల బంగారు ఆబరణాలు, 34 తులాల వెండి, మూడు ద్విచక్ర వాహనాలు 2 సెల్ ఫోన్లు ,1 టాబ్ స్వాదీనం.
ఈ కేసు లో నిందితుల ను చాకచక్యంగా పట్టుకున్న సి‌సి‌ఎస్ డి‌ఎస్‌పి,నల్గొండ డి‌ఎస్‌పి వి .నరసింహ రెడ్డి గారి పర్యవేక్షణ లోనల్లగొండ 2 టౌన్ సి.ఐ పి.యన్.డి.ప్రసాద్, సి‌సి‌ఎస్ సి‌ఐ జితేందర్ రెడ్డి ,వెంకటేశ్వర్లు, సి‌సి‌ఎస్ యస్.ఐ మహేందర్ ,నల్గొండ టూ టౌన్ ఎస్‌ఐ లు రాజశేకర్ రెడ్డి,సైదులు,వారి సిబ్బంది ఎం‌డి.షంషుద్దీన్ ,శంకర్ ,బాలకోటి , సి‌సి‌ఎస్ సిబ్బంది విష్ణువర్దన్ గిరి ,రామ్ ప్రసాద్,మోహిన్ పాషా లను జిల్లా ఎస్‌పి గారు అబినందించడం జరిగింది