Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసినిమాహైదరాబాద్

Jani Master : చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..!

Jani Master : చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..!

మన సాక్షి, హైదరాబాద్ :

లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అదుపులో ఉన్న జానీ మాస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు సంచలన షాక్ ఇచ్చింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.

తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై ఆదివారం కేసు నమోదు చేశారు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫైర్ కింద ఈ కేసును నార్సింగ్ స్టేషన్ కు బదిలీ చేశారు.

దాంతో జానీ మాస్టర్ పై ఫోక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి శుక్రవారం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు.

ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలపై ఆయన భార్య తీవ్రంగా స్పందించారు. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసేందుకు కుట్రపడ్డారని ఆరోపించారు.

ఆరోపణలు చేస్తున్న అమ్మాయి టాలెంట్ ను చూసి ఢీ షో తర్వాత ఆమెకు జానీ మాస్టర్ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. మూడేళ్ల నుంచి ఆమె ప్రవర్తన తేడాగా ఉందని పేర్కొన్నారు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు