తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

ISRO : 22 ఏళ్లకే.. అతి చిన్న వయసులో ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం..!

ISRO : 22 ఏళ్లకే.. అతి చిన్న వయసులో ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం..!

మన సాక్షి, కొండమల్లేపల్లి :

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చాములేడు గ్రామానికి చెందిన ఓట్ల ధీరజ్ కౌశిక్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం సంపాదించాడు. ఆయన గ్రామంలోనే కాంగ్రెస్ నాయకులు శివాశర్మ మేనల్లుడు. మేనమామ వద్ద ఉండి ఆయన చదువు కొనసాగించాడు. 22 ఏళ్లు అతిపిన్న వయసులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం పొందాడు.

బాల్యంలో చామలేడు గ్రామంలో అతనితో కలిసి పెరిగిన విద్యార్థులు అందరూ శుభాకాంక్షలు తెలిపినారు. అదే గ్రామానికి చెందిన శివాశర్మ అన్నయ్య రాధాకృష్ణ పంతులు డిఆర్డిఓ లో సైంటిస్ట్ గా చేసినారు. గ్రామస్తులందరూ ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటూ గ్రామీణ స్థాయి నుంచి సైంటిస్ట్ గా ఎదిగినందుకు ధీరజ్ కౌశిక్ కి అభినందనలు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు