తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

Job mela : మార్చి 12న జాబ్ మేళా నిర్వాహణ..!

Job mela : మార్చి 12న జాబ్ మేళా నిర్వాహణ..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

జిల్లాలోని నిరుద్యోగ యువకులకు హైదరాబాద్ లోని పే టీఎం సర్వీస్ లో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 12న బుధవారం రోజున సమీకృత జిల్లా కలెక్టరేట్లో రూమ్ నెంబర్ 225 నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పేటిఎం సర్వీస్ సంస్థలో 30 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయని, ఈ పోస్ట్ కు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని, వీరి వయస్సు 18 నుంచి 40 లోపు ఉండాలని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు మార్చి 12న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో సమీకృత జిల్లా కలెక్టరేట్ కు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7013188805, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

MOST READ : 

Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

Galaxy Health insurance : అదిరిపోయే టాప్-అప్‌తో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

మరిన్ని వార్తలు