Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Joededdula Bandalagudu competitions : అంతరాష్ట్ర జోడెద్దుల బండలాగుడు పోటీలు..!

Joededdula Bandalagudu competitions : అంతరాష్ట్ర జోడెద్దుల బండలాగుడు పోటీలు..!

రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:

రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అట్టహాసంగా జోడెద్దుల బండలాగు పోటీలను నిర్వహించారు. ఈ బండలాగు పోటీలు 1999లో లట్టుపల్లి వెంకట్ రెడ్డి ప్రారంభిచారు.

 

దేవుని పడకల్ గ్రామంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బండలాగుడు పోటీలను గ్రామ మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలంతో కలసి స్థానిక ఎస్సై ఎ శ్రీకాంత్ ఘనంగా ప్రారంభించారు. ఈ బండలాగు పోటీలలో అంతరాష్ట్ర వివిధ ప్రదేశాల నుండి 4 జోడెద్దుల జంటలు పాల్గొని ఎంతో బ్రహ్మాండంగా బండలాగుతూ భక్తులను విశేషంగా గ్రామ ప్రజలకు ఆకట్టుకున్నాయి.

 

మొదటి జోడి డాక్టర్ అఖిలేష్ రెడ్డి యాదిరెడ్డి పల్లి గ్రామం తాండూర్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లా వారు రెండు మూడవ జోడిగా మడతల చంద్రహోబుల్ రెడ్డి చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారు నాలుగవ జోడెద్దులు ఎమ్ గోపాల కృష్ణ పెద్దదగడ గ్రామం చెన్నంబాయి మండలం వనపర్తి జిల్లాల వారు జోడెద్దుల బండలాగు పోటీలలో పాల్గొన్నారు.

 

ద్వితీయ బహుమతులు మడతల చంద్ర హోబుల్ రెడ్డి వారు కైవసం చేసుకున్నారు. మొదటి బహుమతి 1,00,116 రెండవ బహుమతి 80,116 శతాబ్ది టౌన్‌షిప్ ఎండి కాసు శ్రీనివాస్ రెడ్డి వారి అందించారు. మూడవ బహుమతి డాక్టర్ అఖిలేష్ రెడ్డి జోడెద్దుల కైవసం చేసుకున్నారు. నాలుగు బహుమతి ఎమ్ గోపాల కృష్ణ వారికి దక్కింది నాలుగోవ బహుమతిగా యస్ ఆర్ డెవలప్మెంట్ షాద్‌నగర్ వారు అందజేశారు.

 

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జోడెడ్ల బండ పోటీలు గ్రామస్థులు సురక్షితంగా నిర్వహించుకోవాలన్నారు. శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు గ్రామస్థులు సుఖ సంతోషాలతో జరుపుకుంటూ ఎలాంటి సంఘటనలు జరగకుండా గ్రామస్థులు ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు