Nagarjunasagar : ఆస్తులు అమ్మడంతో పాటు ఖాతాదారుల డబ్బు మాయం.. ఏపీజివి బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్..!

నాగార్జునసాగర్ బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసుకుని మోసానికి పాల్పడుతున్న కేసులో బ్యాంక్‌ ఉద్యోగిని విజయపురి టౌన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.నాగార్జునసాగర్ సర్కిల్ సి.ఐ బిసన్న, ఎస్‌ఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం..

Nagarjunasagar : ఆస్తులు అమ్మడంతో పాటు ఖాతాదారుల డబ్బు మాయం.. ఏపీజివి బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్..!

ఆస్తులు అమ్మి, 40 లక్షల వరకు అప్పు చేసి ఆన్ లైన్ బెట్టింగ్

ఖాతాదరుల ఖాతాలో డబ్బు మాయం

నాగార్జున సాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ బ్యాంకు ఖాతాదారుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అక్రమంగా డ్రా చేసుకుని మోసానికి పాల్పడుతున్న కేసులో బ్యాంక్‌ ఉద్యోగిని విజయపురి టౌన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.నాగార్జునసాగర్ సర్కిల్ సి.ఐ బిసన్న, ఎస్‌ఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం..

తిర్మలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీ గ్రామానికి చెందిన కె.గిరీష్(35) నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని ఏ.పి.జి.వి.బి బ్రాంచిలో ఫీల్డ్ ఆఫీసర్ గా ఉద్యోగిగా ఉంటూ ఖాతాదారులు జమ చేసిన డబ్బులు సుమారు రూ,,6,57,000 రూపాయలు తన సొంత అవసరాలకు వినియోగించుకుని బ్యాంకును మోసగించారని తెలిపారు.

ALSO READ : Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

ఇట్టి ఫిర్యాదు పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో స్థానిక ఎస్సై తన సిబ్బందితో కలిసి జానారెడ్డి కాలనీలో ఉన్న ఉద్యోగి గిరీష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తను నేరాన్ని అంగీకరిస్తూ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి బ్యాంక్ ఖాతాదారులైన అమాయక ప్రజలు జమ చేసిన డబ్బును జమ చేయకుండా క్రికెట్ బెట్టింగ్లలో పెట్టే వాడని ఇలా బ్యాంక్ డబ్బు 6,57,000 రూపాయలు తో పాటు తన ఆస్తులు అమ్మి బయట అప్పులు చేసి మరో 40 లక్షల వరకు ఆన్లైన్ బెట్టింగులలో పెట్టి పోగొట్టుకున్నానని అంగీకరించడం జరిగిందని తెలిపారు.

తాను వాడిన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ మహాదేవ్, డఫెట్,ఓనిక్స్ బెట్, రమ్మీ కల్చర్ ,గల్లీపేట్ అని అన్నారు. విచారణ అనంతరం తన వద్ద నుండి సెల్ఫోన్ రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.ఈ కేసు లో ప్రతిభ కనబరిచిన విజయపురి టౌన్ ఎస్ఐ సంపత్ మరియు హెడ్ కానిస్టేబుల్ గురునాథం, కానిస్టేబుల్ జావీద్, హోమ్ గార్డ్ రామ్మోహన్,ప్రభు లను అభినందించిన సి ఐ బీజన్న.

ALSO READ : KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!