మిర్యాలగూడ : కడసారి చూపుకు వెల్లనివ్వని యజమాని… కాలినడకన కార్మికులు

మిర్యాలగూడ : కడసారి చూపుకు వెల్లనివ్వని యజమాని… కాలినడకన కార్మికులు

మాడ్గులపల్లి, మనసాక్షి:

మా కుటుంబ సభ్యులు చనిపోతే కడసారి చూసేందుకు వెళ్లకుండా తమ ఇటుక బట్టీ యజమాని కర్కశంగా వ్యవహరిస్తున్నాడు … అంటూ నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని మిర్యాలగూడ నియోజకవర్గంలోని గాండ్రవానిగూడెం లోని ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా కార్మికులు సోమవారం కాలి నడకన ఇంటి దారి పట్టారు.

 

వారు కాలినడకన చిన్న పిల్లలలతో రోడ్డు పై వెళుతుంటే.. అది చూసిన సీపీఎం నాయకులు కార్మికులను ట్రాక్టర్ లో తహశీల్దార్ కార్యాలయమునకు తరలించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఇట్టి విషయం పై ఇటుక బట్టి యజమాని రత్నం స్పందిస్తూ 6 నెలలకు గాను సర్దార్(బ్రోకర్)13 లక్షల రూపాయల తీసుకున్నారని అన్నారు.

 

ఇంకా నెల రోజులు గడువు ఉన్నదని అన్నారు. ఉదయం నుంచి ఏమి తింకపోవడంతో స్థానిక జర్నలిస్టులు సొంత ఖర్చుతో…వారికి భోజన సదుపాయం కల్పించడం జరిగింది. చివరకు సర్దార్ తో ఫోన్ లో మాట్లాడిన తరువాత కూడా వారూ ఒడిశా వెళ్లేందుకు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో వారు ఆగ్రహం తో ఒడిశా కు వెళ్లిపోయారు.