Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

ORR : ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. స్పాట్ లో ఆరుగురు మృతి..!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

ORR : ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. స్పాట్ లో ఆరుగురు మృతి..!

హైదరాబాద్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పై శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక లారీని అత్యంత వేగంగా కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దాంతో కారు పైభాగం పూర్తిగా నలిగిపోయి నుజ్జునుజ్జుగా అయింది. కారులోని ప్రయాణికులు బయటికి వచ్చే అవకాశం కూడా లేకుండా పోవడంతో ఆరుగురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి శంషాబాద్ పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు