కర్ణాటక : సీఎం పదవిపై వీడిన ఉత్కంఠ

కర్ణాటక : సీఎం పదవిపై వీడిన ఉత్కంఠ

మనసాక్షి :

కర్ణాటక సీఎం నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠత వీడింది. బుధవారం అర్ధరాత్రి చర్చలు కొలిక్కి వచ్చాయి. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే మంత్రం ఫలించింది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా శివకుమార్ ఖరారయ్యారు. ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల 20న 12:30 గంటలకు సిద్ధరామయ్య రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.