కర్ణాటకలో కాంగ్రెస్ విజయం

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం

బెంగళూరు, మన సాక్షి :

కర్ణాటకలో మరోసారి సంప్రదాయం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 129 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

 

.మరో బిజెపి 64 స్థానాల్లో గెలుపొందగా మరో రెండు స్థానాల్లో అధికతలో ఉంది. జెడిఎస్ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.

 

కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు : రాహుల్ గాంధీ

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. పెత్తందారులకు పేదలకు మధ్య జరిగిన ఈ పోరాటంలో పేదలు గెలుపొందారని పేర్కొన్నారు.

 

ఈ విజయం ప్రజా విజయం అని తెలిపారు. మా వాగ్దానాలను మొదటి క్యాబినెట్ లోని నెరవేరుస్తామన్నారు. భవిష్యత్తులో ఎన్నికల్లో ఇదే విజయం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.