త్వరలో కేసీఆర్ నోటి వెంట గొప్ప మాట వింటారు.. కల్వకుంట్ల

త్వరలో కేసీఆర్ నోటి వెంట గొప్ప మాట వింటారు.. కల్వకుంట్ల

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే

జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి)

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని, గతంలో ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యం అని, రాబోయే కాలంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేసిఆర్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పెన్షన్ దారుల ఆత్మీయ సమ్మేళనంలో తెలిపారు.

మల్లాపూర్ మండల కేంద్రంతోపాటు పాతదామరాజుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పెన్షన్ దారుల కార్డుల పంపిణీ కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్ రావు ,బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ఈ సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కెసిఆర్ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాడని, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడ్డాడని, ఉచిత విద్యుత్, రైతుబంధు, ఆసరా పెన్షన్ కళ్యాణ లక్ష్మి ఇలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా చేసాడని అన్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్, బిజెపి నాయకులు గ్రామాల్లో తిరుగుతున్నారని అలాంటి వారిని నమ్మొద్దని మరొకసారి కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టలని కోరారు.

రాబోయే రోజుల్లో పెన్షన్ల పెంపు పై రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి వెంట గొప్ప మాట వింటారని అన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలు నన్ను నాలుగు సార్లు ఆదరించారని నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశానని, కెసిఆర్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని రాబోయే రోజుల్లో తన కుమారుడైన సంజయ్ నీ ప్రజలు ఆదరించాలని, ప్రజాసేవకుడిగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యాడని, డాక్టర్ వృత్తిని వదిలి ప్రజలకు సేవ చేసేందుకు సంజయ్ వచ్చాడని, వచ్చే ఎన్నికల్లో సంజయ్ ని శాసనసభకు పంపాలని సాగర్ రావు ప్రజలని కోరారు.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

అత్యధిక పెన్షన్లు వచ్చేది మన నియోజకవర్గానికి అని, ఇంకా పెన్షన్ దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని,బీడీ పెన్షన్ రాని వారు త్వరలోనే శుభవార్త వింటారని, నియోజకవర్గ అభివృద్ధికి సంజయ్ మరింత పాటుపడతారని, నియోజవర్గ ప్రజలు సంజయ్ ని ఆదరించాలని ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మైదాసు శ్రీనివాస్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో జగదీష్,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు అధికారులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!