రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం, ఎమ్మెల్యే భాస్కరరావుకు కెసిఆర్ ఫోన్

రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం, ఎమ్మెల్యే భాస్కరరావుకు కెసిఆర్ ఫోన్

హైదరాబాద్, మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పొందుగుల వద్ద ఆటో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు .

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో కెసిఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.