Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

విద్యుత్ చీఫ్ ఇంజనీర్ కీలక ప్రకటన.. గ్రామాలలో విద్యుత్ అధికారుల పర్యటన..!

గ్రామంలో రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఉబ్బిని బాలస్వామి పేర్కొన్నారు.

విద్యుత్ చీఫ్ ఇంజనీర్ కీలక ప్రకటన.. గ్రామాలలో విద్యుత్ అధికారుల పర్యటన..!

చింతపల్లి, మన సాక్షి :

గ్రామంలో రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఉబ్బిని బాలస్వామి పేర్కొన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని మదనాపురం గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ తో పాటు ఆ శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి రైతులతో ముచ్చటించారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వివరించాలని రైతులకు సూచించారు. గ్రామంలోని కొంతమంది రైతులు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ల సమస్య ఉందని అధికారులకు సూచించగా, వెంటనేస్పందించిన అధికారులు రైతుల పొలాల వద్దకు వెళ్లి విద్యుత్ సమస్యలు పరిష్కరించారు.

వారన్న వేసవి దృశ్య విద్యుత్ ఏ ఈ, లైన్మెన్లు, గ్రామ ప్రజలకు,రైతులకు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండాచర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డి ఈ బాల్య, ఏడిఈ సాగర్ రెడ్డి, చింతపల్లి మండలఏ ఈ మురళీకృష్ణ, స్థానిక సర్పంచ్ జంగిటి విజయలక్ష్మి శ్రీనివాస్ యాదవ్, గ్రామ రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు