తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : మున్సిపల్ కౌన్సిల్ లో కీలక తీర్మాణాలు.. కానరాని మున్సిపల్ వైస్ చైర్మన్..!

Narayanpet : మున్సిపల్ కౌన్సిల్ లో కీలక తీర్మాణాలు.. కానరాని మున్సిపల్ వైస్ చైర్మన్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ యొక్క సాధారణ సర్వసభ్య సమావేశము మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ అధ్యక్షతన నిర్వహించారు. ఇట్టి సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం. పర్ణిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత చైర్ పర్సన్, కౌన్సిలర్లకు శాలువాలతో సన్మానించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు పెరిగిన మున్సిపల్ అధికారులు తను చెప్పే వరకు తొలగించలేదని మున్సిపల్ కమిషనర్ సునీత పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎక్కడ అని ఆరా తీశారు. ఇట్టి సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు సత్య రఘు పాల్ రెడ్డి, రాఘవేంద్ర పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వారు మాట్లాడుతూ పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న లేఔట్ నంబర్ 80/93 లో గల మార్టి గేజ్ ప్లాట్ లకు అనుమతులు ఇస్తున్నారని వాపోయారు.

వీటిపై టౌన్ ప్లానింగ్ అధికారి దృష్టిసారించాలని సూచించారు. పట్టణంలోని వివిధ వార్డులలో కరెంట్ స్తంభాలు లేవని కొత్త స్తంభాలు అమర్చాలని కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. దీనికి ఎలక్ట్రికల్ ఏఈ మహేష్ గౌడ్ స్పందిస్తూ స్తంభాలు కావాలని కౌన్సిల్ తీర్మానం కాపీ తనకు ఇస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్తంభాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు.

ప్రజా పాలనలో భాగంగా వార్డు సభలలో వార్డు ఆఫీసర్లు కౌన్సిలర్ లకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. వార్డు ఆఫీసర్లు తమ ఇష్టాను సారంగా వ్యవహారిస్తున్నరన్నారు. ఈ సమావేశం సాధారణంగా సాఫీగా కొనసాగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మరియు కౌన్సిలర్లు అందరూ హాజరైన 17వ వార్డు కౌన్సిలర్ హాజరు కాలేదని చర్చించుకున్నారు.

కౌన్సిల్ సమావేశంలో కానరాని మున్సిపల్ వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టడ్. ఇట్టి సమావేశంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, మేనేజర్ మల్లికార్జున్ టిపిఓ కిరణ్, ఏ ఈ మహేష్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ జి సిబ్బంది పాల్గొన్నారు.

LATEST UPDATE : 

  1. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  2. Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!

  3. Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..! 

  5. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు